![రితిక్‌సోదిగా వెన్నెల కిషోర్](https://static.v6velugu.com/uploads/2022/06/Vennela-Kishore-play-key-role-in-Happy-birthday-movie_ZqVj4tkHs5.jpg)
ఇటీవల వినూత్నమైన పోస్టర్స్‌తో, వైవిధ్యమైన టీజర్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం హ్యాప్తీ బర్త్‌డే. మత్తువదలరా చిత్రంతో తన ప్రతిభను నిరూపించుకున్న రితేష్ రానా దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కీరోల్ పోషిస్తోంది. సత్య, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం జూలై 15న రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌ను పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. రెండు చేతుల్లో రెండు గన్స్ పట్టుకొని కనిపిస్తున్న వెన్నెల కిషోర్ రితిక్‌సోదిగా ఆలరించనున్నాడు. ఓ వర్గానికి విరోధి అంటూ వాయిస్‌ఓవర్‌లో వచ్చే సంభాషణలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి రితిక్‌సోది పాత్ర సినిమాకి మొయిన్ హైలెట్ గా నిలవనుందని తెలుస్తోంది. కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సురేష్ సారంగం సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్: నార్నీ శ్రీనివాస్, ఫైట్స్: శంకర్ ఉయ్యాలా, లైన్‌ప్రొడ్యూసర్: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబా సాయికుమార్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కెవీవీ, పీఆర్‌ఓ: వంశీ శేఖర్, మడూరి మధు