వెన్నెల కిషోర్ టైటిల్ రోల్‌లో రైటర్ మోహన్ తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కీలక పాత్రలు పోషించారు. వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు.
డిసెంబర్ 25న సినిమా రిలీజ్ సందర్భంగా దర్శకుడు మోహన్ మాట్లాడుతూ ‘ఇది ఏడుగురి కథ. డిటెక్టివ్ పాత్ర పోషించిన కిషోర్ గారిది రైలు బోగీలకు ఇంజన్ లాంటి క్యారెక్టర్. ప్రతి పాత్ర కథలో కీలకం. డిటెక్టివ్ రోల్ కొంచెం హ్యూమర్‌తో ఉంటుంది. సినిమా కోసం కిషోర్ గారు ఉత్తరాంధ్ర యాసని నేర్చుకున్నారు. క్రైమ్, కామెడీ, ఎమోషన్, థ్రిల్ లాంటి అన్ని ఎలిమెంట్స్‌ను బ్యాలెన్స్ చేశాం.
Also Read:-జోష్ పెంచుతున్న గేమ్ ఛేంజర్.. .'దోప్' అంటే అర్థం తెలుసా!
1991లో వైజాగ్ పర్యటన ముగించుకున్న రాజీవ్ గాంధీ.. శ్రీపెరంబుదూర్ వెళ్లి అక్కడ హత్యకు గురయ్యారు. అదేరోజు శ్రీకాకుళంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒక పెద్ద ఘటన జరిగినప్పుడు చిన్న ఇన్సిడెంట్స్‌ను ఎవరూ పట్టించుకోరు. ఈ నేపథ్యంలో ఇంటరెస్టింగ్ స్క్రీన్‌ప్లేతో దీన్ని తెరకెక్కించాం. ఎవరూ ఊహించని సస్పెన్స్, థ్రిల్ ఇందులో ఉన్నాయి’ అని చెప్పారు.