ఏఐసీసీ ఓబీసీ వింగ్ నేషనల్ కోఆర్డినేటర్‌‌‌‌గా వేణు

ఏఐసీసీ ఓబీసీ వింగ్ నేషనల్ కోఆర్డినేటర్‌‌‌‌గా వేణు
  •      కర్నాటక స్టేట్ ఇన్‌‌చార్జిగా కూడా నియామకం

న్యూఢిల్లీ, వెలుగు: ఏఐసీసీ ఓబీసీ వింగ్ నేషనల్ కో ఆర్డినేటర్‌‌‌‌గా తెలంగాణకు చెందిన నంది మండలం వేణును కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అలాగే, కర్నాటక స్టేట్ ఇన్‌‌చార్జిగా కూడా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఆ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు రిలీజ్ చేశారు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆదేశాలతో వేణుకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు అందులో పేర్కొన్నారు.

 ఖర్గే, సోనియాల నేతృత్వంలో పార్టీని బలోపేతానికి వేణు కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయన్నారు. కాగా.. తన నియామకంపై ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్‌‌చార్జి దీపాదాస్ మున్షీకి వేణు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నెరవేరుస్తానన్నారు.