Venu Swami, Dimple Hayathi: ఇవెక్కడి పూజలు సామీ.. డైరెక్ట్గా వైన్ బాటిల్స్ పెట్టేశారు!

Venu Swami, Dimple Hayathi: ఇవెక్కడి పూజలు సామీ.. డైరెక్ట్గా వైన్ బాటిల్స్ పెట్టేశారు!

తన జ్యోతిశ్యంతో కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారిపోయారు వేణుస్వామి(Venu Swamy). పొలిటీషియన్స్, సినిమా స్టార్ లైఫ్ గురించి ప్రిడిక్షన్స్ చెప్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు ఆయన. సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకుంటారని చెప్పి అది జరగడంతో ఒక్కసారిగా ఫేమస్ వేణు స్వామి. 

ఇక అక్కడి నుండి చాలా మంది సెలబ్రిటీల జీవితాల గురించి, వారి వివాహాల గురించి సంచలన కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. వాటిలో ఒక సమంత విషయంలో తప్పా ఏ ఒక్కటి కూడా జరగలేదు. అయినప్పటికీ చాలా మంది స్టార్స్ ఆయన్ని నమ్ముతున్నారు. అంతేకాదు.. హీరోయిన్లు కూడా ఆయనతో పూజలు చేయించుకుంటే కెరీర్ బాగుటుందని, అవకాశాలు బాగా వస్తాయని నమ్ముతున్నారు. అలా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నుండి బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి వరకు చాలా మంది ఆయనతో పూజలు చేయించుకున్నారు. తాజాగా ఆ లిస్టులో డింపుల్ హయాతి కూడా చేరిపోయింది. ఆమె కూడా వేణుస్వామితో పూజలు చేయించుకున్నారు. అయితే ఈసారి పూజలో వైన్ బాటిల్స్ కనిపించడం అనేది హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

దీంతో అవి చూసిన నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇదెక్కడి పూజ సామీ, ఏకంగా వైన్ బాటిల్స్ పెట్టేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై వేణు స్వామి గతంలోనే క్లారిటీ ఇచ్చారు.. ఇలాంటి పూజల్లో తీర్థం మంచి నీళ్లతో ఉండదని, అందుకే అందులో ఎవరు ఏది తాగితే అది కలిపి ఇస్తానని చెప్పారు.