నిధి అగర్వాల్ ఇంట్లో వేణు స్వామి పూజలు

నిధి అగర్వాల్ ఇంట్లో వేణు స్వామి పూజలు

టాలీవుడ్ సెలబ్రిటీల జాతకాలు చెప్తూ ఈ మధ్య సోషల్ మీడియాలో పాపులర్ అయిన వేణు స్వామి ఆధ్వర్యంలో టాలీవుడ్ కథానాయిక నిధి అగర్వాల్ పూజలు చేసుకుంది. కెరీర్ స‌జావుగా సాగేందుకు వేణుస్వామిని కలిసి తన ఇంట్లో ప్రత్యేకంగా పూజ‌లు, యాగాలు నిర్వహించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

ఇండస్ట్రీలో మంచి అవకాశాల కోసం నిధి.. రాజ శ్యామల పూజ చేయించినట్లు తెలుస్తోంది. సవ్యసాచి, ఇస్మార్ట్ శంకర్ చిత్రాల్లో నటించిన నిధి.. తర్వాత అవకాశాలు నెమ్మదించాయి. దీంతో అవకాశాల కోసం ఈ దారి పట్టింది. స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకుల‌ విషయంతో పాటు ప‌లువురు టాలీవుడ్ ప్రముఖుల జీవితాల‌పై వేణుస్వామి చెప్పిన కొన్ని విష‌యాలు స‌రిగ్గా జ‌రిగాయి. 

దాంతో అత‌ని మాట‌ల‌పై చాలా మందికి న‌మ్మకం కుదిరింది. గ‌త కొంతకాలంగా  టాలీవుడ్ ప్రముఖులంతా వేణుస్వామి చుట్టూ చ‌క్కర్లు కొడుతున్నారు. గతంలో రష్మిక మందన్న కూడా వేణుస్వామితో పూజలు చేయించినట్లు వార్తలు వచ్చాయి.