కోదాడ, వెలుగు : మండలంలోని తోగర్రాయి గ్రామంలో సంతాన వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం దేవతాహ్వానం, మండప పూజలు, భేరీ పూజ, హోమం నిర్వహించారు.
ధ్వజారోహణ అనంతరం దంపతులకు స్వామివారి గరుడ ప్రసాదం అందజేశారు. వేదపండితులు ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి ఎదుర్కోలు దివిటీ ఉత్సవం జరిపిన తరువాత తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఆలయ చైర్మన్ వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, ధర్మకర్తలు రమేశ్, శ్రీనివాసరావు, నరసింహారావు, సురేశ్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులుపాల్గొన్నారు.