
నవగ్రహాల్లో శుక్రుడు స్థానం వెరీ వెరీ స్పెషల్. దాంపత్య సంతోషం, శ్రేయస్సు, ఆకర్షణ, వైభవంతో పాటు కళలకు అధిపతి. శుక్రుడు సెప్టెంబర్ 4న కర్కాటక రాశిలో అడుగు పెట్టనున్నాడు. అక్టోబర్ 2 ఉదయం వరకు కర్కాటకరాశిలో ఉండనున్నాడు. అనంతరం సింహరాశిలో అడుగు పెట్టి.. నవంబర్ 3 వరకు సంచరించనున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రుడి ప్రభావం ప్రతి రాశిపై ఉండనుంది. కర్కాటక రాశిలో .. శుక్రగ్రహ సంచారం వలన జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఏ రాశివారికి ఎలా ఉండనుందో తెలుసుకుందాం..
మేష రాశి:
ఈ రాశి వారికి శుక్రుని సంచారం నాల్గవ ఇంట్లో జరగబోతోంది. మేష రాశి వారికి శుక్రుడు ధనానికి అధిపతి, సప్తమ గృహం కావడం వల్ల సంతోష గృహంలో శుక్రుడు సంచరించనున్నాడు. దీంతో స్థిర, చరాస్థులు పెరిగే అవకాశాలున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వైవాహిక జీవితంలో సంతోషంతో పాటు... పదవ ఇంటిలో శుక్ర గ్రహ సంచారంతో ఉద్యోగులకు, వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. మేషరాశి రాజకీయ నాయకులకు ప్రతిష్ట, అనుబంధం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. శరీరాన్ని, మనసును, బుద్ధిని సరిగ్గా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలను పొందుతాయని జ్యోతిష్కులు చెబుతున్నారు.
వృషభ రాశి :
వృషభ రాశి వారికి, శుక్రుడు లగ్నానికి అధిపతి. ఆరవ ఇంటిలో సంచరించనున్నాడు. శుక్రుడు కుడి వైపున ఉన్నప్పుడు అదృష్టం కలుగుతుందని చెబుతున్నారు. అందం, వ్యక్తిత్వంలో పెరుగుదల ఉండి... సౌందర్య సాధనాల పట్ల ఆసక్తి పెరుగుతుందట. తక్కువ శ్రమతో ఎక్కువ విజయం సాధిస్తారని పండితులు అంటున్నారు. ఉద్యోగ , వ్యాపారాల్లో సౌకర్యాలు పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్కులు అంటున్నారు. తోబుట్టువులు, స్నేహితుల నుండి పూర్తి సహకారం, గౌరవం పొందుతారట. పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉందంటున్నారు జ్యోతిష్య నిపుణులు.
మిధునరాశి:
మిథునరాశి వారికి ఐదవ స్థానానికి అధిపతి అయిన శుక్రుడు రెండవ ఇంటిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు సరైన దిశలో ఉన్నప్పుడు మిథున రాశి వారికి ఆహార పానీయాల పట్ల ఆసక్తి పెరుగుతుందని పండితులు అంటున్నారు. ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందట. అయితే ఈ రాశికి చెందిన వారు డయాబెటిక్ పేషెంట్ అయితే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉందని జ్యోతిష్కులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి నాల్గవ, పదకొండవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు లగ్న రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ... కర్కాటక రాశిలో సంచరించడం వలన ఈ రాశివారి వ్యక్తిత్వంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. అనవసర ఖర్చులను నివారించుకోవాలని సూచిస్తున్నారు. వైవాహిక జీవితంలో వివాదాలు ఏర్పడే అవకాశం ఉందట. రాజకీయాల్లో ఉన్నవారు ప్రమోషన్ పొందే అవకాశం ఉందట. వ్యాపారంలో విజయం సాధిస్తారని పండితులు అంటున్నారు.
సింహ రాశి
సింహ రాశి వారికి దశమి, తృతీయ స్థానానికి అధిపతి అయిన శుక్రుడు బయటి ఇంట్లో సంచరించనున్నాడు. శుక్రుడు సంచరిస్తున్నప్పుడు ఆన్‌లైన్ లేదా బ్యాంకింగ్ పనులతో సంబంధం ఉన్న వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుందట. వినోదం, విలాసాల కోసం ఖర్చులు పెరుగుతాయట. ఇతరులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
కన్యా రాశి
కన్యా రాశి వారికి శుక్రుడు, సంపద, అదృష్టానికి అధిపతిగా, లాభదాయకమైన ఇంట్లో సంచరిస్తున్నాడు. దీంతో అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉందట. కొంతకాలంగా పెడుతున్న అనవసర ఖర్చులు తగ్గి... ఆస్తిలో పెరుగుదల ఉంటుందని జ్యోతిష్కులు అంటున్నారు. ఈ సమయం విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. సంగీతం, కళ లేదా ఏదైనా సృజనాత్మక పనికి సంబంధించిన వ్యక్తులకు శుక్రుడు సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల ద్వారా గౌరవాన్ని పొందుతారు.
తులారాశి
తులారాశి వారికి శుక్రుడు లగ్నానికి అధిపతి. ఎనిమిదవ ఇంటిలో సంచరిస్తున్నాడు. తుల రాశి వారికి శుక్రుని సంచారం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అయితే వృత్తి, వ్యాపారంలో ... శుక్రుడు కర్కాటరాశిలో సంచరించడం వలప కొన్ని సమస్యలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే రీసెర్చ్, ఎల్‌ఐసి, ఆర్కియాలజీ, సీబీఐ రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులకు శుక్ర సంచారం ప్రయోజనాలను కలిగిస్తుంది. స్థిరాస్థులు, చరాస్తులను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, కొంత సమయం వేచి ఉండాలని పండితులు సూచిస్తున్నారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి శుక్రుడు బయటి, ఏడవ ఇంటికి అధిపతిగా ఉంటాడు. శుక్రుడు అదృష్ట గృహంలో సంచరించనున్నాడు. శుక్రుడు కుడి వైపున ఉండడంతో లక్కీ వీరి సొంతమని జ్యోతిష్య గ్రంధాల్లో ఉందని పండితులు అంటున్నారు. కొంతకాలంగా ఎదురవుతున్న ఆకస్మిక, అనవసరమైన సమస్యల నుండి మీరు ఉపశమనం పొందే అవకాశం ఉందని చెబుతున్నారు. వ్యాపారంలో పురోగతి ఉంటుందంటున్నారు. అయితే స్త్రీలనుంచి కొన్ని చిక్కులు ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి ఆరు, పదకొండవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఎనిమిదవ ఇంట్లో సంచరించనున్నాడు. ఆరోగ్య విషయంలో కొన్ని చిక్కులు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు . ముఖ్యంగా ఈ రాశివారు డయాబెటిక్ పేషెంట్ అయితే.. శారీరక ఇబ్బందులు కలిగి... అధిక ఖర్చులు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. రం. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
మకరరాశి
మకర రాశి వారికి ఐదవ, పదవ గృహాలకు అధిపతి అయిన శుక్రుడు ఏడవ ఇంటిలో సంచరించనున్నాడు. శుక్రుని సంచారం వల్ల ఆరోగ్యం, అనవసర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందట. శుక్ర సంచారం వైవాహిక జీవితానికి, వ్యాపారానికి చాలా మంచిదని జ్యోతిష్కులు అంటున్నారు. వ్యాపారంలో కొత్త మార్గాలు ఏర్పడిగౌరవం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. కర్కాటక రాశిలో శుక్ర గ్రహ సంచారం వలన సామాజికంగా గౌరవం పెరుగుతుందని పండితులు అంటున్నారు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి శుక్రుడు, నాల్గవ , తొమ్మిదవ ఇంటికి అధిపతిగా ఆరవ ఇంటిలో సంచరిస్తున్నాడు. శుక్రుని సంచారంతో శత్రువులు పెరిగినా కాని.... మీ నడవడిక ఆలోచనతో ప్రతి సమస్య నుండి బయటపడతారని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఉద్యోగస్థులు శుభఫలితాలను అందుకుంటారంటున్నారు. ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే .. విజయాన్ని అందుకునే అవకాశం ఉందంటున్నారు జ్యోతిష్య నిపుణులు.
మీనరాశి
మీన రాశి వారికి శుక్రుడు, శౌర్యానికి అధిపతి.. శుక్రుడు ఎనిమిదవ ఇంటికి, ఐదవ ఇంటిలో సంచరించనున్నాడు. శుక్రుడు సంచారంతో ఈ రాశి వ్యక్తుల ఆరోగ్యం మెరుగుపడుతుందట. ఆలోచనలు అదుపులో ఉండేలా చూసుకోవాలని పండితులు సూచిస్తు్న్నారు. కన్సల్టెన్సీ, పరిశోధనా రంగాల్లో ఉన్న వ్యక్తులకు శుక్రుడి సంచారం వలన శుభఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు.