Astrology: మార్చి 1న వృషభ రాశిలోకి శుక్రుడు ... ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..

Astrology: మార్చి 1న వృషభ రాశిలోకి శుక్రుడు  ... ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..

జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు ప్రేమ, అందం, లగ్జరీ, సృజనాత్మకత, సంపద, శ్రేయస్సు, వైవాహిక ఆనందానికి కారకంగా పరిగణించబడుతున్నాడు. శుక్ర గ్రహం  రాక్షసుల గురువుగా కూడా పరిగణించబడుతున్నాడు. మార్చి 1 వ తేదీన శుక్రగ్రహం తన రాశిని మార్చుకున్నాడు. మేషరాశిని వీడిన.. శుక్రుడు వృషభరాశిలోకి ప్రవేశించాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా  శుక్ర గ్రహం వృషభరాశిలోకి మారడం వలన  ఏరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . .. 

మేషరాశి:  శుక్రుడు ...వృషభ రాశిలోకి ప్రవేశించడంతో మేషరాశి వారికి  కొన్ని అనుకోని పరిస్థితులు ఏర్పడుతాయి.  మేషరాశికి చెందిన వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.   వృత్తి... వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  అనుకోకకుండా లాభాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  ఉద్యోగస్తులకు స్థానచలనం కలిగే అవకాశం ఉంది.  ఆరోగ్య పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. 

వృషభ రాశి:  వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి.  శుక్రుడు ఇదే రాశిలో ఉండటం వలన ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది.  ఉద్యోగస్తులకు వేతనంతో పాటు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది.  వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు. కొత్తగా  వ్యాపారం ప్రారంభించే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.  కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

మిథున రాశి:  శుక్రుడు... వృషషరాశిలో సంచరించడం వ లన  మిథున రాశి వారికి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. ఈ సమయంలో  కొంత సంయమనం పాటించాలి. వృత్తి .. వ్యాపార రంగంలోని వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.  అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి.  కొత్త పనులు ప్రారంభ పనులను వాయిదా వేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఎవరితోను వాదనలు పెట్టుకోకండి.. సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండండి. అన్నిటికి కాలమే పరిష్కారం చూపుతుంది.

కర్కాటక రాశి : ఈ రాశి వారికి శుక్రుడు వృషభ రాశిలో సంచరించడం వలన  చాలా అనుకూలంగా ఉంటుంది.  శుక్రుడు కర్కాటక రాశికి అధినేత అయినందున లాభ స్థానంలో సంచరిస్తాడు.  కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  స్థాన చలనం.. ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంటుంది.  వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వచ్చే అవకాశం ఉంది. 

సింహ రాశి : వృషభరాశిలో శుక్ర గ్రహం సంచరించడంతో సింహరాశి వారికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పనులు పూర్తి అవుతాయి. జాయింట్​ వ్యాపారాలు కలసి వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరగడంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి.  వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసివస్తాయి.. విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. 

కన్యా రాశి : శుక్రుడు వృషభ రాశిలో సంచారం వలన కన్యారాశికి చెందిన వారికి  ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి.  వ్యాపారంలో ఇప్పటి వరకు ఉన్న కొంత అసంతృప్తి తొలగి లాభాల బాట పడతారు. వైవాహిక జీవితం చాలా ఆనందంగా కొనసాగుతుంది. ఉద్యోగస్తులు మీరే.. ఆఫీసులో కీలకంగా మారే అవకాశం ఉంది.   ఇక విద్యార్థుల విషయానికొస్తే అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ఎలాంటి  ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుందని  జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

తులా రాశి:  ఈ రాశి వారికి  శుక్రుడు వృషభ రాశిలో సంచరించడం వలన ఎంతో కాలంగా పెండింగ్​ లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబసభ్యుల మధ్య ప్రేమ.. అనురాగం పెరుగుతుంది.  ఉద్యోగస్తులకు పనిభారం పెరిగినా సంతృప్తికరంగానే ఉంటుంది.  ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలతో పాటు అవార్డులు కూడా వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు,  అనుకోని ఖర్చులు రావడం వలన ఆర్థికంగా కొద్దిపాటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేసుకోవాలని పండితులు  సూచిస్తున్నారు. 

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి వృషభరాశిలో శుక్రుడి సంచారం వలన ఇప్పటి వరకు ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పెళ్లి ప్రయత్నాలు చేసే వారికి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. అవసరానికి మించిన డబ్బు చేతిలో ఉంటుంది. పూర్వీకుల ఆస్తి కలిసి రావడంతో విలాసవంతమైన  జీవితాన్ని గడుపుతారు.  ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం... వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. 

ధనుస్సు రాశి: శుక్రుడు వృషభంలో సంచారం వలన ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి.  శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.  ఆర్ధిక విషయంలో గతంలో కంటె పరిస్థితి  మెరుగుపడుతుంది. ప్రేమ విషయాలు అనుకూలిస్తాయి.  వ్యాపారంలో అధిక లాభాలు గడిస్తారు. వృత్తి విషయంలో శ్రమ పడాల్సి వస్తుంది.  ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది.  ఆఫీసులో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది...

మకర రాశి:  శుక్రుడు ... వృషభరాశిలోకి మారడం వలన ఈ రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ధనస్సు రాశికి చెందిన ఉద్యోగస్తులు ఆఫీసులో కీ రోల్​ పోషించే అవకాశం ఉంది. వీరికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు లభిస్తాయి.  ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఉద్యోగులకు అనుకోకుండా ప్రమోషన్​ వస్తుంది . ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు శుభవార్త వింటారు. విదేశీ ప్రయాణాలు కలసివస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు పాటించాలి.

కుంభ రాశి: శుక్రుడు .. వృషభ రాశిలో మారడం వలన కుంభ రాశి వారి విషయంలో ఆర్థికంగా పురోగతి ఉంటుంది.  ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు శుభవార్త వింటారు. పూర్వీకుల ఆస్తి కలసి వచ్చే అవకాశం ఉంది. మీరు చేస్తున్న వృత్తిలో చాలా  మంచి పేరు తెచ్చుకునే సమయం వచ్చింది.ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా కొనసాగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వచ్చే అవకాశం ఉంది.  ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా కొనసాగుతుంది.

మీనరాశి:  ఈ రాశి వారు వృత్తి పరంగా వృత్తి పరంగా మంచి ఫలితాలను పొందుతారు.మీరు పనిలో బాగా రాణిస్తారు. మీరు తీసుకునే నిర్ణయం లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అవుతుంది.  డబ్బు సంపాదించేందుకు కొత్త మార్గాలు ఏర్పడుతాయి. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగడంతో  మాసనికంగా సంతోషంగా ఉంటారు.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు ఫలిస్తాయి.