మంచిర్యాల జిల్లాపై సీఎం కేసీఆర్​ది కపట ప్రేమ

మంచిర్యాల జిల్లాపై సీఎం కేసీఆర్​ది కపట ప్రేమ

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాపై సీఎం కేసీఆర్​ కపట ప్రేమ చూపిస్తున్నారని, మంచిర్యాల మున్సిపాలిటీకి రూ.25 కోట్లు ఎందుకు ప్రకటించలేదని బీజేపీ డ్రిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వెరబల్లి రఘునాథ్ అన్నారు.  బుధవారం జిల్లా కేంద్రంలోని 19 వ వార్డు కాలేజ్ రోడ్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్​ ఇటీవల నిర్మల్, గద్వాల్ లో  పర్యటించి జిల్లాలో ఉన్న ప్రతి మున్సిపాలిటీకి రూ. 25 కోట్లను ఇస్తున్నట్లు ప్రకటించారు. కానీ మంచిర్యాల జిల్లాలో ఉన్న 7 మున్సిపాలిటీలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.  

మంచిర్యాల సింగరేణి ప్రాంతం నుంచి వేల కోట్ల ఆదాయం వస్తున్నా ఆ నిధులను జిల్లాలో ఖర్చు పెట్టకుండా ఇతర పథకాలకు తరలించి మంచిర్యాల జిల్లా అభివృద్ధిని  అడ్డుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు, పెద్దపల్లి పురుషోత్తం, ఆకుల అశోక్ వర్ధన్, జోగుల శ్రీదేవి, బల్ల రమేశ్, కంకణాలు సతీశ్, శివ శంకర్, రంగ శ్రీశైలం, ముదాం మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.