బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కుటుంబాలకు 200 గజాల భూమి : వెరబెల్లి రఘునాథ్

నస్పూర్, వెలుగు :  బీజేపీకి అవకాశమిస్తే గని కార్మికులకు 200 గజాల స్థలం వచ్చేలా చూస్తామని ఆ పార్టీ మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ హామీ ఇచ్చారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లికార్జున నగర్, ఏఎస్ఆర్ నగర్, ఠాగూర్ నగర్​లో బుధవారం ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవినీతి బీఆర్​ఎస్​పాలనలో స్థానికంగా రోడ్లు, డ్రైనేజీ సరిగా లేవని విమర్శించారు.

సింగరేణి గని కార్మికులకు ఇంటి స్థలం ఇస్తానని సీఎం కేసీఆర్​గతంలో హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. కార్యక్రమంలో ఈర్ల సదానందం, సత్రం రమేశ్, జీవీ ఆనంద కృష్ణ, పనుగంటి మధు, పాషా, మిట్టపల్లి మొగిలి, భీమయ్య, రానవేణి శ్రీను, సుమన్, చక్రి తదితరులు పాల్గొన్నారు.