నస్పూర్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ అన్నారు. సోమవారం నస్పూర్ మున్సిపాలిటిలోని సంగమల్లయ్య పల్లెలో ఇంటింటికీ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. చెల్లని పట్టాలు ఇచ్చి పేద ప్రజలను కాంగ్రెస్ నేత కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మోసం చేశారని అన్నారు. ఎమ్మెల్యే దివాకర్ రావు, బీఆర్ఎస్ నేతలు పేదల భూములను కబ్జా చేశారని ఆరోపించారు.
ఒక్కసారి బీజేపీకి అవకాశమిస్తే పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామన్నారు. బీజేపీ నస్పూర్ పట్టణ కన్వీనర్ రమేశ్, ప్రధాన కార్యదర్శి సదానందం, మైనారిటీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పాషా, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్, బీజేవైఎం జిల్లా కార్యదర్శులు రానవేణి శ్రీను, చక్రి, సుమన్, బీజేవైఎం పట్టణ నాయకులు అంబాల సాగర్, మహేశ్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సిరికొండ రాజు ఇతర నాయకులు పాల్గొన్నారు.