Vere Level Office: టైటిల్కి తగ్గట్లే ఈ ట్రైలర్ వేరే లెవెల్‌‌.. కార్పొరేట్‌ కామెడీ కోసం సిద్ధంగా ఉన్నారా!

Vere Level Office: టైటిల్కి తగ్గట్లే ఈ ట్రైలర్ వేరే లెవెల్‌‌.. కార్పొరేట్‌ కామెడీ కోసం సిద్ధంగా ఉన్నారా!

అఖిల్ సార్థక్, ఆర్ జే కాజల్, శుభశ్రీ, మిర్చి కిరణ్, రీతూ చౌదరి, స్వాతి చౌదరి, వసంతిక, మహేశ్ విట్టా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘వేరే లెవెల్ ఆఫీస్’. ఇ సత్తిబాబు దర్శకత్వంలో వరుణ్ చౌదరి గోగినేని నిర్మించారు. గురువారం డిసెంబర్ 12 నుంచి ఆహాలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

ఈ నేపధ్యంలో ది సౌండ్ అఫ్ ఆఫీస్ మ్యాడ్ నెస్ పేరుతో ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు ఆహా తీసుకోస్తున్న ఈ సీరిస్  చాలా సందడిగా కనిపిస్తోంది. కార్పొరేట్ ఫ్యామిలీస్ అందరికీ ఈ సిరీస్ బాగా కనెక్ట్ అయ్యేలా ట్రైలర్ సాగింది.

ALSO READ | పుష్ప 2 సినిమా చూడటానికి వెళ్లిన ఆడియన్స్ కి షాక్.. డబ్బులు వాపస్ ఇవ్వాలని డిమాండ్..

టైటిల్కి తగినట్లే ఈ సిరీస్ వేరే లెవెల్‌‌లో ఉంటుందనే విషయం విజువల్స్ చూస్తే అర్థమైపోతుంది. 50 ఎపిసోడ్స్‌‌గా ఈ సిరీస్ రాబోతోందని సమాచారం. మరి కార్పొరేట్‌ ఆఫీస్‌ కామెడీ ప్రేక్షకులకు ఎలాంటి కొత్త అనుభూతిని ఇస్తుందో చూడాలి. ఈ సిరీస్‌కు సంగీతం అజయ్‌ అరసాడ. కాగా ఇప్పటికే తెలుగు ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ ఒరిజినల్ తెలుగు సినిమాలు, సిరీస్ లను నిర్మిస్తూ దూసుకెళ్తోంది.