పీఎం విశ్వకర్మ దరఖాస్తుల వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలి

పీఎం విశ్వకర్మ దరఖాస్తుల వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలి
  • హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

హైదరాబాద్ సిటీ, వెలుగు: పీఎం విశ్వకర్మ పథకానికి వచ్చిన దరఖాస్తుల వెరిఫికేషన్ వేగవంతంగా పూర్తిచేయాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం విశ్వకర్మ పథకంపై అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు 19,206 మంది దరఖాస్తు చేసుకోగా, కేవలం 236 మందికి మాత్రమే రుణాలు అందించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెండింగ్​లో ఉన్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో వేగంగా వెరిఫికేషన్ చేసి, 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో జీఎండీఏసీ ప్రవీణ్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆశన్న తదితరులు పాల్గొన్నారు.