ఐప్యాడ్, ఆండ్రాయిడ్ ఫోన్, కంప్యూటర్.. ఇలా రకరకాల గాడ్జెట్స్ వాడుతుంటాం. వాటికి రకరకాల కనెక్టింగ్ పోర్ట్స్ఉంటాయి. అలాంటప్పుడు అన్నింటికీ ఒకే పెన్‌డ్రైవ్ వాడడం ఎలా? ఈ సమస్యకు పరిష్కారంగా ‘వెరిలక్స్’ అనే కంపెనీ 4ఇన్ 1 పెన్‌డ్రైవ్‌ని తీసుకొచ్చింది. దీనికి నాలుగు రకాల మేల్ సాకెట్లు ఉంటాయి. దీన్ని యూఎస్బీ, లైట్-నింగ్, మైక్రో యూఎస్బీ, టైప్–సీ.. నాలుగింటికీ కనెక్ట్ చేసుకోవచ్చు.
ఇది 64, 128, 250 జీబీ స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది చాలా చిన్నగా ఉండడం వల్ల కీచైన్‌కి కూడా ఎటాచ్ చేసుకుని వాడుకోవచ్చు. అల్యూమినియం మెటల్ బాడీ ఉండడం వల్ల ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. ధర : స్టోరేజ్‌ని బట్టి 1,349 రూపాయల నుంచి మొదలు