
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై క్రియేటీవ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తెరకెక్కిస్తున్న మూవీ "వ్యూహం"(Vyuham). అనౌన్స్మెంట్ తోనే సంచలనాలు క్రియేట్ చేసిన ఈ మూవీ నుండి తాజాగా పవన్ కళ్యాణ్ పాత్ర డిజైన్ ఎలా ఉంటుందో సోషల్ మీడియా లో పంచుకున్నారు వర్మ.
వ్యూహం మూవీ ప్రస్తుత రాజకీయాలను బేస్ చేసుకుని వస్తుండటంతో.. ప్రతి ఒక్కరు వర్మ ఎలాంటి కంటెంట్ చూపించబోతున్నారనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. అందుకు కారణం లేకపోలేదు.. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన జగన్ పాత్ర, వైఎస్ భారతి, చంద్రబాబు నాయుడు పాత్రలు పరిచయం చేయడమే. పవన్ ఈ లుక్ లో తెలుపు దుస్తులు ధరించి..మెడలో పార్టీ కండువా వేసుకుని..నేల పై పడుకుని పైన ఏవో లెక్కపెడుతు..పైకి వేలు చూపిస్తున్నట్లు కనిపిస్తుంది.
ALSO READ :తమన్నాతో రొమాంటిక్ దశ మొదలైంది..నటుడు విజయ్ వర్మ
ఇక పవన్ పోస్టర్ ఎంట్రీతో జన సేన ఫ్యాన్స్ వర్మ పై గుర్రుమంటున్నారు. ఎందుకో అందరికీ తెలిసేందే.. వర్మ అంటే పవన్ ఫ్యాన్స్ కు పడదు. పవన్ ఫ్యాన్స్ అంటే వర్మకి పడదు. సోషల్ మీడియా లో పలుమార్లు ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసున్న విషయం తెలిసేందే. వర్మ వ్యూహం ఇక ఎందరి పాత్రలు పరిచయం చేస్తుందో అని రాజకీయాల్లోను వ్యక్తుల్లో, సినిమాకు సంబంధించిన వ్యక్తుల్లో గుబులు రేపుతోంది. ఇక ఇప్పటికే వర్మ 'ఇది బయోపిక్ కాదని.. బయోపిక్ ను మించిన రియల్ పిక్' అని ప్రకటించిన విషయం తెలిసేందే.
వ్యూహం మూవీలో జగన్ పాత్రను దక్షిణాది నటుడు అజ్మల్ అమీర్ నటిస్తుండగా.. వైఎస్ భారతి పాత్ర లో మానస రాధాకృష్ణన్ నటిస్తుంది. ‘అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం’ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.