SA20: ఆ ముగ్గురు భారత క్రికెటర్లు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడితే చూడాలని ఉంది: సౌతాఫ్రికా పేసర్

SA20: ఆ ముగ్గురు భారత క్రికెటర్లు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడితే చూడాలని ఉంది: సౌతాఫ్రికా పేసర్

సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్ 2025 ఐపీఎల్ తర్వాత అతి పెద్ద లీగ్ గా మారుతుంది. అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు ఈ లీగ్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. న్యూజిలాండ్ మాజీ ఆటగాడు కేన్ విలియంసన్, ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, రూట్, టీమిండియా వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్ 2025 సౌతాఫ్రికాలో ఆడడంతో ఈ టోర్నీకి మంచి ఆదరణ లభిస్తుంది. బిగ్ బాష్ లీగ్.. పాకిస్థాన్ సూపర్ లీగ్.. కరీబియన్ ప్రీమియర్ లీగ్ లను దాటి  క్రేజ్ సంపాదించింది. 

ఈ లీగ్ లో ముగ్గురు భారత క్రికెటర్లు పాల్గొంటే చూడాలని మాజీ సౌతాఫ్రికా ప్లేయర్ వెర్నాన్ ఫిలాండర్ చెప్పుకొచ్చాడు. సౌతాఫ్రికా లీగ్ కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న వెర్నాన్ ఫిలాండర్ మాట్లాడుతూ ఇలా అన్నాడు.. " భారత ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆడితే చూడాలని ఉంది. సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర ఆట తీరు.. బుమ్రా పదునైన యార్కర్లు.. కోహ్లీ అసామాన్యమైన నిలకడ ఈ టోర్నీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి". అని క్వాలిఫైయర్ 1 సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఫిలాండర్ అన్నారు. 

ప్రస్తుతం ఈ ముగ్గురు భారత క్రికెటర్లలో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ తరపున ఆడుతున్నాడు. సూర్య కుమార్ యాదవ్ టీ20 బెస్ట్ ప్లేయర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. బుమ్రా అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. ఫిలాండర్ సౌతాఫ్రికా బెస్ట్ టెస్ట్ బౌలర్లలో ఒకడు. అతడు 64 టెస్టుల్లో 224 వికెట్లు.. 30 వన్డేల్లో 41 వికెట్లు పడగొట్టాడు.