అరిష్ గ్లోబల్ సర్వీసెస్‌‌తో వెర్టెక్స్ భాగస్వామ్యం.. మూడేళ్లలో 5,000 జాబ్స్

అరిష్ గ్లోబల్ సర్వీసెస్‌‌తో వెర్టెక్స్ భాగస్వామ్యం.. మూడేళ్లలో 5,000 జాబ్స్

హైదరాబాద్, వెలుగు: టైమ్స్ స్క్వేర్ లో (న్యూయార్క్​)హెడ్ ​ఆఫీసు ఉన్న వెర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ యూకేకు చెందిన  అరిష్ గ్లోబల్ సర్వీసెస్‌‌తో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం రాబోయే మూడేళ్లలో 5,000 ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఔట్‌‌సోర్సింగ్ పరిశ్రమను బలోపేతం చేస్తుంది.

వెర్టెక్స్ గ్రూప్ ముఖ్యంగా కస్టమర్ సర్వీస్, ఐటీ సపోర్ట్, డేటా ప్రాసెసింగ్, ఫైనాన్స్, బ్యాక్-ఆఫీస్ కార్యకలాపాల వంటి రంగాలలో ఉపాధిని సృష్టిస్తుంది. అంతర్జాతీయ బిజినెస్ ప్రాసెస్ ఔట్​సోర్సింగ్ మార్కెట్ సైజు 2024 నుండి 2030 వరకు ఏటా 9.6 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. దీనిని బలోపేతం చేసేలా ఈ భాగస్వామ్యం భారతదేశ ఔట్​సోర్సింగ్​సెక్టార్​కు పలు అవకాశాలను సృష్టిస్తుంది.