
మయన్మార్ దేశంలో ఊగిపోయింది.. వణికిపోయింది. భారీ భూకంపంతో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఊగిపోయాయి. మయన్మార్ దేశంలో మండలే జిల్లా కేంద్రం అయిన మండలే పట్టణం కేంద్రంగా ఈ భూకంప కేంద్రం ఉంది. భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఈ కేంద్రం ఉండటంతో.. తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. మయన్మార్ ప్రభుత్వం అంచనా ప్రకారం.. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) నివేదిక ప్రకారం భూకంపం తీవ్రత రిక్కర్ స్కేల్ పై 7.7 గా నమోదైనట్లు ప్రకటించింది.
2025, మార్చి 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో ఈ భూకంపం వచ్చినట్లు మయన్మార్ ప్రభుత్వం ప్రకటించింది. భూకంపం చాలా తీవ్రమైనదని.. ప్రమాదకరమైనదిగా చెబుతోంది. భూకంపం వచ్చి కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే అయ్యిందని.. ఆస్తి, ప్రాణ నష్టాల వివరాలు సేకరిస్తున్నామని వెల్లడించింది అక్కడి ప్రభుత్వం.
భూకంపం తీవ్రత 7.7గా ఉండటంతో.. బర్మా సిటీలోని భారీ భవనాలు ఊగిపోయాయి. ఆఫీసులు, ఇళ్లల్లోని జనం బయటకు పరుగులు తీశారు. బర్మాలోని ఓ షాపింగ్ మాల్ లో భూకంపం ధాటికి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. మంటలు వచ్చాయి. మరో ఘటనతో.. ఓ పెద్ద బిల్డింగ్ పైన ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ నుంచి నీళ్లు కిందకు పడటం కనిపించింది. ఆఫీసుల నుంచి జనం బయటకు పరుగులు తీస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో కనిపించాయి.
7.3 Earthquake from Myanmar felt in Chiang Mai, Thailand. RimPing Super Market in Mae Rim. #earthquake #chiangmai #thailand #แผ่นดินไหว pic.twitter.com/tPqX9Agxs2
— Will Langston 📷 (@heylangston) March 28, 2025
మయన్మార్ లోని భారీ భూకంపం ఎఫెక్ట్.. బ్యాంకాక్ దేశంపైనా పడింది. బ్యాంకాక్ లో నిర్మాణంలో ఉన్న 20 అంతస్తుల భవనం నిలువునా కూలిపోయింది. భూకంపం ధాటికి బిల్డింగ్ నేలమట్టం అయ్యింది. కార్మికులు పరుగులు తీశారు. ఆ బిల్డింగ్ కింద ఎంత మంది ఉన్నారు అనేది ఇంకా స్పష్టత రాలేదు.
Paylaşılan bir görüntüde depremin konumuna en az 700-800 km uzaklıktaki Bangkok'taki bir gökdelende sarsıntıdan etkisiyle bir havuzun suyunun dökülmesi gözleniyor. #earthquake pic.twitter.com/9ka81PEyAe
— Beytullah SARAÇ (@tengridagli) March 28, 2025
మయన్మార్ దేశంలో వచ్చిన భారీ భూ కంపం బ్యాంకాక్ దేశంపైనా పడింది. ఈ రెండు దేశాల్లో ఎంత ప్రాణ, ఆస్తి నష్టం అనేది ఇంకా వెల్లడికాలేదు.
BREAKING
— ⚡NOISE ALERTS⚡ (@NoiseAlerts) March 28, 2025
M7.7 #earthquake hits near Mandalay #Mynamar !!
Strong tremors felt in Bangkok.
Video: A building under construction collapses. pic.twitter.com/J5dL2bmcPi