అయినవాళ్లకు ఆస్తులు పంచి.. చనిపోయాక అంబులెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీ

అయినవాళ్లకు ఆస్తులు పంచి.. చనిపోయాక అంబులెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీ

జగిత్యాల, వెలుగు: సంపాదించిన ఆస్తిపాస్తులు అయినవాళ్లకు పంచిన వృద్ధురాలు.. ఆఖరి ఘడియల్లో అందరికీ భారంగా మారింది. చనిపోయాక ఆమె డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీని ఎవరూ పట్టించుకోకపోవడంతో అనాథ శవంలా అంబులెన్స్ లోనే పడి ఉన్న అమానవీయ ఘటన జగిత్యాలలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. జగిత్యాల పట్టణానికి చెందిన సాదుల సత్తమ్మ (85) అనారోగ్యంతో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయింది. సత్తమ్మ భర్త లక్ష్మణ్ 20 ఏళ్ల క్రితం చనిపోయాడు. వారసులు ఎవరూ లేకపోవడంతో ఆమె బంధువుల ఇంట్లో ఉంటుంది.

ఈ క్రమంలో తన పేరున ఉన్న ఆస్తితో పాటు సొంతింటిని బంధువుల కుమారులకు సమానంగా పంచింది. కాగా సత్తమ్మ మంగళవారం మరణించడంతో తమ ఇంట్లో ఫంక్షన్ ఉందంటూ వారు డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీని తీసుకెళ్లలేదు. ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్లిన వారు.. కనీసం సత్తెమ్మ ఇచ్చిన ఇంట్లో కూడా శవాన్ని ఉంచేందుకు అంగీకరించలేదు. దీంతో సొంతిల్లు ఉన్నా సత్తెమ్మ డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీ అంబులెన్స్ లోనే  ఉంచాల్సి వచ్చింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.