
ఇటాలియన్ఆటోమేకర్ పియోజియో తెలంగాణలో 2025 వెస్పా మోడల్స్నుఈ లాంచ్ చేసింది. వీటిలో వెస్పా, వెస్పా ఎస్, వెస్పా టెక్, వెస్పా ఎస్టెక్, వెస్పా కాలా (స్పెషల్) ఎడిషన్ఉన్నాయి. పాత మోడల్స్‌తో పోలిస్తే వీటిలో సరికొత్త డిజైన్, మరిన్ని ఫీచర్లు ఉంటాయని కంపెనీ తెలిపింది.
ఈ బండ్లలో ఐదు ఇంచుల డిస్ప్లే, బ్లూటూత్కనెక్టివిటీ, నావిగేషన్, 125 సీసీ, 150 సీసీవంటి ఆకర్షణలు ఉంటాయి. వెస్పా వేరియంట్ధరలు రూ.1.33 లక్షల నుంచి, వెస్పా ఎస్ ధరలు రూ.1.37 లక్షల నుంచి మొదలవుతాయి. వెస్పా టెక్ ధరలు రూ.1.93 లక్షల నుంచి, వెస్పా ఎస్ టెక్ ధరలు రూ.1.97 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.