ప్రముఖ సినీ నటుడు ప్రభు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గత కొద్ది రోజులుగా ప్రభు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలోని రాళ్లను డాక్టర్లు తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంనిలకడగా ఉందని, మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభు ఆసుపత్రిలో చేరారనే వార్త విన్న ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కాగా చంద్రముఖి, డార్లింగ్, శక్తి చిత్రాల ద్వారా ప్రభు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇటీవల ఈయన వారసడు చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు.