Atul Parchure: ప్రముఖ కమెడియన్ మృతి.. ముఖ్యమంత్రి నివాళి

Atul Parchure: ప్రముఖ కమెడియన్ మృతి.. ముఖ్యమంత్రి నివాళి

ప్రముఖ మరాఠీ కమెడియన్ అతుల్ పర్చూరే (Atul Parchure) (57) కన్నుమూశాడు. కొన్నేళ్లుగా అతడు క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతూ సోమవారం (అక్టోబర్ 14న) తుది శ్వాస విడిచారు. ఓ వైపు మరాఠీ, హిందీ సినిమాల్లో నటిస్తూనే.. 'ది కపిల్ శర్మ షో' వంటి పలు టెలివిజన్ షోలతో క్లాసీ మరాఠీ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే, గతంలో వైద్యులు అతని కాలేయంలో 5 సెం.మీ కణితిని కనుగొన్నారని ఓ ప్రముఖ షోలో అతుల్ వెల్లడించారు. కాగా అతుల్ పర్చూరేకి భార్య, కుమార్తె ఉన్నారు. అతుల్ పర్చూరే మరణంతో సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించింది.

ఈ క్రమంలో అతుల్ పర్చూరే మృతికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తన ఇన్ స్టాగ్రామ్ లో మరాఠీలో ఓ నోట్ ను షేర్ చేశారు. "తెలివైన నటుడి అకాల నిష్క్రమణ.. ప్రేక్షకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అతను కొన్నిసార్లు నవ్వించే వ్యక్తి, మరికొన్ని సార్లు కంటతడి పెట్టించే వ్యక్తి. క్లాస్ నటుడు అతుల్ పర్చూరే అకాల మరణం బాధాకరం. అతుల్ పర్చూరే బాల్యం నుంచే తన అద్భుతమైన నట జీవితాన్ని చూపించాడు. నాటకం, చలనచిత్రం, ధారావాహికలు అనే మూడు రంగాలలో వారు తమదైన ప్రత్యేక ముద్ర వేశారు.

అతుల్ పర్చూరేకు వేలాది మంది అభిమానుల్లో ఒకరిగా అతని కుటుంబ బాధలో నేనూ భాగమయ్యాను. ఈ బాధను భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలి. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నివాళులర్పిస్తున్నాను. ఓం శాంతి" అని ముఖ్యమంత్రి పోస్ట్ చేశారు.

అతుల్.. బాలీవుడ్ స్టార్ హీరోస్ షారుఖ్ ఖాన్, సంజయ్ దత్, అజయ్ దేవగణ్ వంటి స్టార్స్ తో కలిసి నటించాడు. "నవ్రా మజా నవ్‌సాచా", "సలామ్-ఇ-ఇష్క్", "పార్ట్‌నర్", "ఆల్ ది బెస్ట్: ఫన్ బిగిన్స్", "ఖట్టా మీఠా" మరియు "బ్బుద్దా హోగా టెర్రా బాప్" వంటి చిత్రాలలో కనిపించి మెప్పించాడు.