అలాంటి వ్యాధితో బాధపడుతున్న నటి సుహాసిని... సీక్రెట్ గా ట్రీట్మెంట్...

అలాంటి వ్యాధితో బాధపడుతున్న నటి సుహాసిని... సీక్రెట్ గా ట్రీట్మెంట్...

ఎలాంటి ఎక్స్ పోజింగ్ లేకుండా చక్కని కట్టుబొట్టుతో అలరించిన వెటరన్ హీరోయిన్ సుహాసిని గురించి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి సుహాసిని గతంలో సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, నాగార్జున తదితర సీనియర్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి అలరించింది. అంతేకాదు ఇప్పటికీ అమ్మ, అక్క, చెల్లి తదితర క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటిస్తూ బాగానే అలరిస్తోంది. మరోవైపు తన భర్త మణిరత్నం తీస్తున్న సినిమా పనుల్లో కూడా సాయం చేదోడుగా నిలుస్తోంది. 

అయితే ఇటీవలే నటి సుహాసిని గతంలో తనని బాగా ఇబ్బంది పెట్టిన టీబీ వ్యాధి గురించి స్పందించింది. ఇందులోభాగంగా గతంలో తాను టీబీ వ్యాధితో బాధ పడ్డానని అలాగే టీబీ సమస్య ఉందని డాక్టర్లు చెప్పడంతో భయపడి తన కుటుంబ సభ్యులకి కూడా చెప్పకుండా దాదాపుగా 6 నెలలపాటూ సీక్రెట్ గా ట్రీట్ మెంట్ తీసుకున్నానని తెలిపింది. అయితే ఈ టీబీ వ్యాధి గురించి తెలియని సమయంలో చాలా భయపడ్డానని అందుకే పరువు పోతుందేమోనని అనుకుని ఇతరులకి కూడా చెప్పలేదని కానీ ఈ వ్యాధి గురించి తెలిసిన తర్వాత తన మాదిరిగా టీబీ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారికి ధైర్యం చెబుతూ అవగాహనా కల్పించాలని సంకల్పించినట్లు తెలిపింది. 

ALSO READ | Jr NTR: జపాన్లో భార్య ప్రణతి బర్త్డే సెలబ్రేషన్స్.. హృదయాలను కదిలిస్తున్న తారక్ పోస్ట్

ఈ విషయం ఇలా ఉండగా సుహాసిని ఈమధ్య తన భర్త మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న సినిమాల ప్రొడక్షన్ పనులని దగ్గరుండి చూసుకుంటోంది. అలాగే కమల్ హాసన్ స్థాపించిన "మక్కల్ నీది మయ్యం" పార్టీ వ్యవహారాల్లో కూడా పాల్గొంటోంది.