దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన కొడుకు అనంత కిషోర్ నిర్మించిన చిత్రం ‘తల్లి మనసు’. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ముఖ్య పాత్రల్లో వి శ్రీనివాస్ (సిప్పీ) తెరకెక్కించాడు. ఈనెల 24న సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ ‘తల్లి గొప్పతనం చాటే కథతో తెరకెక్కించామని తెలిపారు. పాత్రలకు తగ్గ నటీనటులు కుదిరని ఇలాంటి మంచి చిత్రాలను ఆదరిస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి’ అన్నారు.
నటి రచిత మహాలక్ష్మి మాట్లాడుతూ కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర పోషించడం ఆనందంగా ఉందని చెప్పింది. ఓ తల్లి మానసిక సంఘర్షణను ప్రేక్షకుల మనసులకు హత్తుకునేలా తెరకెక్కించామని దర్శకుడు వి శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. అలాగే ఈ సినిమాలో సెంటిమెంట్, ఎమోషన్‌తో పాటు ఎంటర్‌టైన్మెంట్ ఉన్నాయని చెప్పాడు. కమల్ కామరాజు, సాత్విక్ వర్మ, నటులు దేవీప్రసాద్, జబర్దస్త్ ఫణి, రచయిత నివాస్, డీవోపీ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.