ప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనగల్ కన్నుమూత

ప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనగల్ కన్నుమూత

ప్రముఖ డైరెక్టర్, రచయిత శ్యామ్ బెనగల్ (90) కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న ఆయన  డిసెంబర్ 23న ముంబైలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. బాలీవుడ్ లో అంకుర్, భూమిక, నిషాంత్, కల్ యుగ్,మంతన్ సహా  వంటి ఎన్నో హిట్  సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. 

హైదరాబాద్ లో జననం

1934 డిసెంబర్ 14న హైదరాబాద్ లోని(అప్పటి హైదరాబాద్ స్టేట్) తిరుమలగిరిలో శ్యామ్ బెనగల్  జన్మించారు. సికింద్రాబాద్ లోని మహబూబ్ కాలేజ్, ఉస్మానియా కాలేజ్ లో ఎంఏ చదువుకున్నారు. 

7 నేషనల్ అవార్డులు

 బెనగల్ పద్మశ్రీ, పద్మభూషణ్, దాదా సాహేబ్ ఫాల్కే సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు.2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం లభించింది. ఏడు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు శ్యామ్ బెనగల్ . 2013లో ఏఎన్ఆర్ జాతీయ అవార్డు వచ్చింది.  చాలా దూరదర్శన్ సీరియల్ లకు కూడా దర్శకత్వం వహించారు. రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు.