మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తానంటే ప్రోత్సహించలేదు.. వర్కౌట్‌ కాదని అన్నారు.. కానీ..

మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తానంటే ప్రోత్సహించలేదు.. వర్కౌట్‌ కాదని అన్నారు.. కానీ..

తెలుగులో ఒకప్పుడు బొమ్మరిల్లు, సై, రెడీ తదితర బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో అలరించిన ప్రముఖ హీరోయిన్ జెనీలియా డిసౌజా గురించి  కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. అయితే నటి జెనీలియా సినిమాల పరంగా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్ ముఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు చక్కబెట్టే పనిలో పడటంతో దాదాపుగా సినిమాలకి టైమ్ కేటాయించలేక పోయింది. అయితే 2022లో తన భర్తతో కలసి వేద్ అనే సినిమాలో నటించి మళ్ళీ హీరోయిన్ గా బాలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. 

ఇటీవలే నటి జెనీలియా తన కంబ్యాక్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందులోభాగంగా పెళ్లి తరవాత సినిమాలకి సమయం కేటాయించ లేకయానని కానీ తన కుటుంబంతో చాలా హ్యాపీగా గడిపానని చెప్పుకొచ్చింది. అయితే మళ్ళీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పుడు కొందరు వద్దన్నారని అలాగే మంచి భర్త, పిల్లలు చక్కగా సాగుతున్న లైఫ్ ని వదిలేసి మళ్ళీ ఇండస్ట్రీకి ఎందుకంటూ ఉచిత సలహాలు ఇచ్చే వారని చెప్పుకొచ్చింది. 

ఇంకొందరైతే ఏకంగా ఇండస్ట్రీని వదిలేసి 10 ఏళ్ళు అవుతుంది కదా.. ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ వచ్చినా వర్కౌట్ కాదని నిరాశ పరిచేవాళ్ళని ఎమోషనల్ అయ్యింది. కానీ తాను ఎవరి మాటలు పట్టించుకోకుండా "వేద్" సినిమాలో నటించానని ఈ సినిమా మంచి హిట్ అవ్వడంతో తనపై తనకి కాన్ఫిడెన్స్ మరింత పెరిగిందని చెప్పుకొచ్చింది.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి జెనీలియా "సితారే జమీన్ పర్" అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో హీరోగా  బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ నటిస్తుండగా ప్రముఖ డైరెక్టర్ ఆర్.ఎస్ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే నటి జెనీలియా ఇటీవలే తెలుగులో "జూనియర్" అనే సినిమాలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.