ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన వెటరన్ హీరోయిన్ ఖుష్బూ గురించి 90స్ ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు.
ఇటీవలే నటి ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో సినిమాల్లోకి రాకముందు తన పర్సనల్ లైఫ్ లో పడిన కష్టాల గురించి పంచుకుంది. ఇందులో భాగంగా తన తండ్రి వల్ల తన కుటుంబం ఎన్నో సమస్యలు చూసిందని అన్నారు. ఈ క్రమంలో తన తల్లి, సోదరులను ఆయన చిత్రహింసలు పెట్టేవాడని తెలిపింది. తనపై జరుగుతున్న లైంగిక దాడి గురించి బయటకు చెబితే ఎక్కడ తన వాళ్లను ఇంకా నరకయాతన పెడతాడోనని భయపడి తాను చాలాకాలం ఈ దారుణాన్ని బయటపె ట్టలేదని ఎమోషనల్ అయ్యింది.
దీంతో పలుమార్లు తన తండ్రిని ఎదిరించే ప్రయత్నం చేసినందుకు షూటింగ్ స్పాట్ కి వచ్చి అందరిముందు అవమానకరంగా మాట్లాడుతూ దడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపింది.ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాతే తాను ధైర్యంగా బదులివ్వడం నేర్చుకున్నానని అన్నారు. ఆయనకు ఎదురుతిరిగిన సందర్భాలు ఉన్నా యని చెప్పుకొచ్చింది.
ALSO READ | GameChanger: గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్, శంకర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత?
ఈ విషయం ఇలా ఉండగా నటి ఖుష్బూ కెరీర్ విషయానికొస్తే ఫస్ట్ ఇన్నింగ్స్ లో హీరోయిన్ గా అలరించిన నటి ఖుష్బూ సెకెండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో కూడా బాగానే ఆకట్టుకుంటోది. ఆ మధ్య తెలుగులో ప్రముఖ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించింది. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.
ఇక నటి ఖుష్బూ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే తమిళ్ ప్రముఖ డైరెక్టర్, నటుడు సి. సుందర్ ని ప్రేమించి పెళ్లి చేసులుకుంది. వీరికి ఇద్దరు సంతానం. ప్రజాలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఖుష్బూ రాజకీయాల్లోకి కూడా వచ్చారు. ఈ క్రమంలో బీజేపీ పార్టీ నుంచి 2021లో తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. కానీ అనుకోకుండా ఓటమిపాలైంది.