టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. 2021లో వచ్చిన అఖండ సినిమా సీక్వెల్ ఇది. అఖండ 2కి కూడా డాషింగ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుని షూటింగ్ ప్రారంభం అయ్యింది.
అఖండ 2 సినిమాలో బాలకృష్ణ కూతురి పాత్ర కోసం టాలీవుడ్ వెటరన్ హీరోయిన్ లయ కూతురిని సెలక్ట్ చేసినట్లు సమాచారం. కాగా శ్లోక ప్రస్తుతం అమెరికాలో తన తల్లిదండ్రులవద్ద ఉంటోంది. శ్లోక పాత్ర అఖండ సినిమాలో బేబీ దీష్ణ నటించిన జనని పాత్రకి కంటిన్యూయేషన్ గా ఉండబోతోంది.
అయితే అఖండ 2 షూటింగ్ షెడ్యూల్ త్వరలోనే అమెరికాలో ప్రారంభం కాబోతోంది. ఈ షెడ్యూల్ లో శ్లోక కి సంబందించిన సన్నివేశాల షూటింగ్ కంప్లీట్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని సెప్టెంబర్ 25న దసరా కానుకగా వచ్చే ఏడాది రిలీజ్ చేస్తునట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. అలాగే అఖండ 2 టైటిల్ కి సంబందించిన ప్రోమోని రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
నటి లయ, బాలకృష్ణ కలసి 2004 లో వచ్చిన "విజయేంద్ర వర్మ" అనే సినిమాలో నటించారు. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ స్వర్ణ సుబ్బారావు దర్శకత్వం వహించాడు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత లయ నటనకి గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. 2018లో నటి లయ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన "అమర్ అక్బర్ ఆంథోని" సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో పెద్దగా గుర్తింపు లభించలేదు.