
తెలుగు రాష్ట్రాల నుంచి ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోయిన్ హోదా అందుకున్న వెటరన్ హీరోయిన్ లయ గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి లయ పెళ్లయిన తర్వాత తన భర్తతో కలసి విదేశాలలో సెటిల్ అయిపొయింది. దీంతో ఆ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించలేదు. అయితే ఆమధ్య తెలుగులో "అమర్ అక్బర్ ఆంటోని" సినిమాలో చిన్న కామియో రోల్ లో కనిపించింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో గుర్తింపు రాలేదు.
Also Read :- కార్తీ సర్దార్ 2 షురూ.. ప్రళయాన్ని ఆపడానికి అలా చేస్తున్నాడా..?
అయితే ఇటీవలే న్యూయార్క్ నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిన నటి లయ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్ ఇంతకు ముందులా అస్సలు లేదని చాలా డెవలప్ అయ్యిందని తెలిపింది. అలాగే హైదరాబాద్ ముందు న్యూయార్క్ ఎందుకూ పనికిరాదని ఐ లవ్ హైదరాబాద్ అని అభిప్రాయం వ్యక్తం చేసింది. హైదరాబాద్ రోడ్ల మీద వెళుతుంటే పెద్ద బిల్డింగులు, ఫ్లైఓవర్లు భలే ఫీల్ ఉంటుందని కానీ ఈ ఫీల్ అమెరికాలోని న్యూయార్క్, డౌన్ టౌన్, లాస్ ఏంజిలిస్ తదితర సిటీలలో తిరిగినా కూడా రాదని చెప్పుకొచ్చింది. అలాగే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువగానే ఉంటుందని చెప్పుకొచ్చింది.
ఈ విషయం ఇలా ఉండగా నటి లయ మళ్ళీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా కొందరు దర్శకనిర్మాతలు సీరియల్స్, సినిమాల్లో ఆర్టిస్ట్ పాత్రలు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. కానీ లయ మాత్రం మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ స్టోరీ సీరియల్ లో నటించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.