ఆ స్టార్ హీరో ఫుల్ గా మందుకొట్టి సెట్స్ కి వచ్చేవాడు: వెటరన్ హీరోయిన్

ఆ స్టార్ హీరో ఫుల్ గా మందుకొట్టి సెట్స్ కి వచ్చేవాడు: వెటరన్ హీరోయిన్

టాలీవుడ్ లో తళుక్కున మెరిసి తెరమరుగైన హీరోయిన్స్ లో బీహారీ బ్యూటీ నీతూ చంద్ర ఒకరు. నీతూ చంద్ర తెలుగులో 2006లో ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గోదావరి సినిమాలో నటించే ఆఫర్ దక్కించుకుంది. ఈ సినిమాలో హీరో మరదలి పాత్రలో నటించి బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నటించిన సత్యమేవ జయతే సినిమాలో పవర్ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది. అయితే ఆ మధ్య ఓ ఇంటర్వూలోల్ నటి నీతూ చంద్ర ఓ టాలీవుడ్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. 

తాను తెలుగు సినిమాల్లో నటించే సమయంలో ఓ హీరో ఫుల్ గా మద్యం సేవించి షూటింగ్ కి వచ్చేవాడని తెలిపింది. దీంతో కొన్ని సన్నివేశాలలో ఆ హీరోతో కలసి నటించేప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేదని వాపోయింది. ఈ విషయం గురించి ఇతర చిత్ర యూనిట్ కి కంప్లైంట్ చేసినప్పటికీ పెద్దగా ఫలితం లేదని ఒకరకంగా చెప్పాలంటే ఈ కారణంగానే తాను తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యానని చెప్పుకొచ్చింది. 

Also Read :- సలార్ రీ రిలీజ్ కి అదిరిపోయే రెస్పాన్స్.. లక్ష టికెట్లు తెగాయట..

అయితే హీరో డ్రింకింగ్ గురించి మరో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునతో కూడా చెప్పానని దాంతో ఆయన మరోసారి ఇలాంటివి రిపీట్ కావని భరోసా ఇచ్చాడని తెలిపింది. కానీ మద్యం సేవించి షూటింగ్ సెట్స్ లో తనని ఇబ్బంది పెట్టిన హీరో ఎవరనేది మాత్రం నీతూ చంద్ర చెప్పడానికి ఇష్టపడలేదు.

ఈ విషయం ఇలా ఉండగా నటి నీతూ చంద్ర తెలుగు ఇండస్ట్రీకి దూరమైనా భోజ్ పూరీ, హిందీ సినీ పరిశ్రమల్లో ఆఫర్లు దక్కించుకుంటూ  బాగానే రాణించింది. అంతేకాకుండా దేశ్వా (భోజ్‌పురి), మిథిలా మఖాన్ (మరాఠీ) తదితర సినిమాలకి నిర్మాతగా కూడా వ్యవహరించింది.