అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన తెలుగు హీరోయిన్.. అలాంటి వాడంటూ కామెంట్స్..

అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన తెలుగు హీరోయిన్.. అలాంటి వాడంటూ కామెంట్స్..

తెలుగు ప్రముఖ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధిచింది. అలాగే 14 రోజులపాటూ రిమాండ్ లో ఉంచి విచారించాలని నాంపల్లి కోర్టు పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ విషయం టాలీవడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

అయితే అల్లు అర్జున్ అరెస్ట్ పై టాలీవుడ్ సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇందులోభాగంగా ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పందించింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ నెపోటిజం నుంచి కాకుండా సొంతంగా టాలెంట్ నిరూపించుకుని స్టార్ గా ఎదిగిన హీరో అని అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే అల్లు అర్జున్ తన ఫేవరెట్ యాక్టర్ అని గతంలో బన్నీతో దిగిన ఫోటోలని షేర్ చేసింది. 

ALSO READ : అల్లు అర్జున్‌‌కు హైకోర్టులో మధ్యంతర బెయిల్

ఇక బహిరంగ ర్యాలీలు, సభల్లో ఎంతోమంది అమాయకులు మండే ఎండ కింద, తొక్కిసలాటల్లోనూ చనిపోయారని గుర్తు చేసుకుంది. ఇలా సభలు, ర్యాలీలతో ఎంతమంది చనిపోయారో చూడటానికి ట్రై చేస్తున్నానని వ్యంగంగా ఎక్స్ లో ట్వీట్ చేసింది. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపింది. దీంతో అల్లు అర్జున్ కి మద్దతుగా నిలిచినందుకు పూనమ్ కౌర్ కి థాంక్స్ చెబుతున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా నటి  పూనమ్ కౌర్ అప్పట్లో మాయాజాలం, ఒక వి చిత్రం, శౌర్యం, ఈనాడు తదితర సినిమాలతోపాటూ మరిన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించి బాగానే ఆకట్టుకుంది. కానీ ఆ తరవాత కొంతకాలంపాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. దాంతో అవకాశాలు కోల్పోయింది. అయితే ఆమధ్య నాతిచరామి అనే సినిమాతో మళ్ళీ కెరీర్ ని ఆరంభించింది. కానీ ఈ సినిమా కనీసం రిలీజ్ అయినట్లు కూడా చాలామందికి తెలీదు.