
ఒకప్పుడు హీరోయిన్ గా నటించి పెళ్లయిన తర్వాత కెరీర్ కి గుడ్ బై చెప్పిన వారిలో వెటరన్ హీరోయిన్ రంభ ఒకరు. నటి రంభ మలేలే టాలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే అప్పట్లోనే నటి రంభ తెలుగు రాష్ట్రాల నుంచి ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకున్న వారిలో ఒకరిగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి (బావగారు బాగున్నారా.. ), రాజేంద్ర ప్రసాద్ (ఆ ఒక్కటి అడక్కు), జగపతిబాబు (అల్లరి ప్రేమికుడు), బాలకృష్ణ, వెంకటేష్ తదితర స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది.
అంతేకాదు దేశముదురు, యమదొంగ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి అదరగొట్టింది. అయితే నటి రంభ కెనడాకు చెందిన శ్రీలంక తమిళ వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాథన్‌ను 8 ఏప్రిల్ 2010న తిరుమలలోని కర్ణాటక కల్యాణ మండపంలో వివాహం చేసుకుంది. ఆ తర్వాత కెనడా లో సెటిల్ అయ్యారు. పెళ్లయిన కొన్నేళ్ళకి రంభ తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో తన పిల్లల సంరక్షణ తానే చూసుకుంటానని కానీ తానూ అడిగినంత భరణం ఇవ్వాలని కోర్టుకు తెలిపింది.
అయితే రంభ భర్త ఇంద్రకుమార్ కూడా ఇందుకు అంగీకరించడంతో కొన్నేళ్లపాటూ సెపరేట్ గా ఉన్నారు. కానీ పిల్లల పెంపకం ఒక్కరి వల్లే సాధ్యం కాకపోవడం, తన పిల్లల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని విడాకులు క్యాన్సిల్ చెయ్యమని కోరడంతో ఇప్పుడు మళ్ళీ కలసి ఉంటున్నారు. అయితే ఈమధ్య నటి రంభ మళ్ళీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా వెయిట్ లాస్ అయ్యి మంచి హోమ్లీ లుక్ అలరించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
ALSO READ : ఆ స్టార్ హీరో తన మాజీ భార్యకి భరణంగా రూ.380 కోట్లు ఇచ్చాడా..?
ఈ విషయం ఇలా ఉండగా మన్మధుడు సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో తళుక్కున మెరిసి మెప్పించిన వెటరన్ హీరోయిన్ అన్షు అంబానీ కూడా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగా టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన మజాకా సినిమాలో మంచి రోల్ చేసింది. మరి నటి రంభ సెకెండ్ ఇన్నింగ్స్ లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.