
ఒకప్పుడు యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న వెటరన్ హీరోయిన్ విజయశాంతి గురించి తెలుగు ఆడియన్స్ కి కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు.. అప్పట్లో నటి విజయశాంతి సాఫ్ట్ అయినా, హార్డ్ అయినా ఇలా పాత్ర ఏదైనా ఆ పాత్రకి తగ్గట్టుగా నటిస్తూ కట్టి పడేసింది. పెళ్లి తర్వాత రాజకీయాలు, కుటుంబ భాద్యతలలో బిజీ అవ్వడంతో సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ప్రస్తుతం నటి విజయశాంతి తెలుగులో ప్రముఖ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన "అర్జున్ S% వైజయంతి" సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ సినిమాలోని పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం 10 కిలోల బరువు తగ్గినట్లు చెప్పుకొచ్చింది. మొదటగా ఈ ఆఫర్ వచ్చినప్పుడు వెంటనే యాక్సెప్ట్ చెయ్యలేదని 4 నెలలపాటు గ్యాప్ తీసుకుని ఈ క్రమంలో 8 కేజీలు తగ్గానని తెలిపింది. షూటింగ్ ఏడాదిపాటూ జరిగిందని ఈ క్రమంలో మరో 2 కేజీలు తగ్గానని చెప్పుకొచ్చింది. అయితే బరువు తగ్గడం కోసం నాన్ వెజ్ తినడం మానెయ్యడంతోపాటూ జిమ్ వర్కవుట్లు చెయ్యడం, స్పెషల్ ఫుడ్ డైట్ పాటించానని తెలిపింది. అయితే నార్మల్ గా తాను పోలీస్ ఆఫీసర్ పాత్రా చేస్తున్నానంటే తాను గతంలో చేసిన కర్తవ్యం, వైజయంతి సినిమాలు అందరికీ గుర్తొస్తాయని, కచ్చితంగా అప్పటి లుక్ కి, ఇప్పటి లుక్ కి కంపార్ చేస్తారని దీంతో షేపవుట్ అయితే ఛండాలంగా ఉంటుందని అందుకే కొంచెం కష్టమైనా సరే బరువు తగ్గానని తెలిపింది.. దీంతో రాములమ్మ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అంటున్నారు నెటిజన్లు..
ఈ విషయం ఇలా ఉండగా "అర్జున్ S% వైజయంతి" ఏప్రిల్ 18న థియేటర్స్ లోకి రానుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే కొన్నేళ్లుగా కళ్యాణ్ రామ్ కి సరైన హిట్ లేదు. దీంతో ఈ సినిమాతో హిట్ కొట్టాలని బాగానే శ్రమించాడు. మరి "అర్జున్ S% వైజయంతి" ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి ..