
ప్రముఖ కన్నడ హాస్య నటుడు బ్యాంక్ జనార్ధన్ (Bank Janardhan) ఏప్రిల్ 14 తెల్లవారుజామున కన్నుమూశారు. బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు.
నటుడు బ్యాంక్ జనార్ధన్ వయస్సు సంబంధిత వ్యాధుల కారణంగా, ఆయన ఇటీవల మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా నేడు 2 గంటల సమయంలో మరణించారు. ఆయన భౌతికకాయాన్ని ఈరోజు సాయంత్రం 5:30 గంటల వరకు సుల్తాన్‌పాల్యలోని ఆయన నివాసంలో అభిమానులు నివాళులర్పించేందుకు ఉంచుతారు. ఆయనకు 79 సంవత్సరాలు.
కన్నడ సినీ పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధ నటులలో బ్యాంక్ జనార్దన్ ఒకరు. తన అత్యుత్తమ నటన మరియు అద్భుతమైన హాస్య సమయస్ఫూర్తితో అపారమైన గుర్తింపు పొందారు. ఆయన దాదాపు 500 కి పైగా చిత్రాలలో నటించారు.
తెలుగులో ఖననం, లాస్ట్ పెగ్, ఉపేంద్ర 2 సినిమాలు చేశారు. టెలివిజన్‌లో సైతం, పాపా పాండు, జోకలి మరియు రోబో ఫ్యామిలీ వంటి సీరియల్స్ ద్వారా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే, నటుడు బ్యాంక్ జనార్ధన్ తొలుత బ్యాంకులో పనిచేశారు. దాంతో నాటకాలు, సినిమాలు ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.