ప్రముఖ నటి కన్నుమూత..లెజెండరీ హీరోలతో స్క్రీన్ షేర్

ప్రముఖ నటి కన్నుమూత..లెజెండరీ హీరోలతో స్క్రీన్ షేర్

ప్రముఖ తమిళ నటి CID శకుంతల (84) కన్నుమూశారు. ఆమె మంగళవారం (సెప్టెంబర్ 17న) సాయంత్రం ఛాతి నొప్పితో బెంగళూరులో తుది శ్వాస విడిచారు. శకుంతల కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని ఆమె కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. ఆమె మృతి పట్ల తెలుగు, తమిళ సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.   

శకుంతల బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా సినీరంగంలోకి ప్రవేశించి తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ చిత్ర పరిశ్రమల్లో 600కి పైగా సినిమాల్లో నటించింది. సి.ఐ.డి, నేతాజీ (1996), నాన్ వనంగుమ్ దైవం (1963), మరియు కాయ్ కొడుతా దైవం (1964)తో సహా పలు ప్రముఖ చిత్రాలకు శకుంతల ప్రసిద్ధి చెందింది. C.I.D లో జైశంకర్ సరసన హీరోయిన్ గా ఆమె నటించింది. శంకర్ (1970) తర్వాత ఆమెను 'C.I.D.' అని ముద్దుగా పిలవడం ప్రారంభించారు. 

ALSO READ  : ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉంటే.. మాకు ఫిర్యాదు చేయండి : తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌

ఇకపోతే 'శకుంతల' చివరి చిత్రం 1998లో పొన్మానై తేది. అగ్రనటులు MGR, శివాజీ వంటి లెజెండరీ హీరోలతో శకుంతల స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తెలుగులో నాగేశ్వరావు హీరోగా వచ్చిన 'బుద్దిమంతుడు', కృష్ణ నటించిన 'నేను మనిషినే' వంటి పలు సినిమాల్లో నటించింది. అయితే ఆమె 2019 వరకు అనేక టెలివిజన్ సీరియల్స్‌లో తన నటనను కొనసాగిస్తూ వచ్చింది.