గేదెలకు లంచం.. ఏసీబీకి పట్టుబడిన వెటర్నరీ డాక్టర్

గేదెలకు లంచం.. ఏసీబీకి పట్టుబడిన వెటర్నరీ డాక్టర్

రూ.6వేలు లంచం తీసుకంటూ ఓ వెటర్నరీ డాక్టర్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. 

నల్గొండ జిల్లా, చింతపల్లిలోని పశు వైద్యాశాలలో పనిచేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ "డాక్టర్ పాల్ జోసెఫ్ గౌతమ్" ఓ రైతుకు చెందిన 8 గేదెలకు ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి రూ.6,000 లంచం డిమాండ్  చేశాడు. పాలు అమ్ముకొని జీవనం సాగించే సదరు రైతు తనకు అంత ఆర్థిక స్తోమత లేదని మొరపెట్టుకున్నా.. డాక్టర్ కనికరించలేదు. ఆ పాపమే అతన్ని పట్టించింది. రైతు నుంచి లంచం తీసుకుంటుండగా డాక్టర్ పాల్ జోసెఫ్‌ను అనిశా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.