
పినపాక, వెలుగు: మండలం కేంద్రంలోని వెటర్నరీ హాస్పిటల్లో అటెండర్‌గా పనిచేస్తున్న పండా శ్వేత(40) బుధవారం రాత్రి హార్ట్ఎటాక్తో చనిపోయారు. పినపాక వెటర్నరీ డాక్టర్ బాలకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్వేత కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో హార్ట్ఎటాక్ రావడంతో చనిపోయారు. మృతురాలికి ఓ కూతురు ఉంది.