విజయ్ సేతుపతి (Vijay Sethupathi) చేతిలో చాలా సినిమాలున్నాయి. వాటిలో జాతీయ అవార్డు విన్నర్ వెట్రిమారన్ (Vetrimaran) డైరెక్ట్ చేస్తున్న ‘విడుదలై-పార్ట్2’ (Viduthalai Part2) ఒకటి. సూరి మరో లీడ్ రోల్ చేస్తున్న ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు తమిళ భాషల్లో క్రిస్మస్ కానుకగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. విజయ్ సేతుపతి మావోయిస్ట్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? అందుకు కారణమయ్యిన అంశాల్ని ట్రైలర్లో చాలా లోతుగా చూపించారు వెట్రిమారన్.
విజయ్ సేతుపతి పోషించిన 'పెరుమాళ్ వాతియార్' పాత్ర యొక్క శక్తివంతమైన కథను కొనసాగిస్తూ.. అతని ప్రయాణం, అతని రాజకీయ తిరుగుబాటు మరియు సిస్టమ్‌తో అతనికున్న సంక్లిష్ట సంబంధాన్ని లోతుగా చూపించిన విధానం ఆకట్టుకుంటోంది. కుల మత రాజకీయాలను అడ్డుపెట్టుకుని కొందరి వ్యక్తుల మోసం.. అందుకు తిరగబడిన ఓ సామాన్యుడు.. పూర్తిస్థాయి మావోయిస్ట్‌గా ఎలా మారడనేది కథాంశంగా తెరకెక్కినట్టు తెలుస్తోంది.
Also Read :- నానా హైరానా మెలోడీ ప్రోమో.. సింగర్స్ కార్తీక్, శ్రేయా ఘోషల్ అదరగొట్టేసారు
‘విడుదలై-పార్ట్2' ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ థియేట్రికల్ హక్కులను శ్రీ వేదాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు సొంతం చేసుకున్నారు. అయితే ఈ విడుదలై-పార్ట్2 మూవీని తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ఎంతోమంది నిర్మాతలు పోటీ పడగా.. చివరకు ప్రముఖ నిర్మాత చింతపల్లి రామారావు ఫాన్సీ రేట్‌కి దక్కించుకుని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్నారు.