ధర్మ రక్షణకు వీహెచ్‎పీని విస్తరించాలి: విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు

ధర్మ రక్షణకు వీహెచ్‎పీని విస్తరించాలి: విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: ధర్మ రక్షణ కోసం విశ్వహిందూ పరిషత్​ను విస్తరించాలని ఆ సంస్థ పెద్దలు పిలుపునిచ్చారు. గ్రామాలు, తండాలు, అటవీ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలకు ప్లాన్ ​చేయాలన్నారు. అన్నోజిగూడలోని రాష్ట్రీయ విద్యా కేంద్రంలో ఈ నెల 22 నుంచి 24 వరకు వీహెచ్ పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. సోమవారం వీహెచ్​పీ అఖిల భారత సంఘటన్ ​సహకార్యదర్శి వినాయకరావు దేశ్ పాండే, ఆర్ఎస్ఎస్​ తెలంగాణ ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్, దక్షిణ భారత సంఘటన్​ కార్యదర్శి స్థాను మలయన్, భాగ్యనగర్ క్షేత్ర సంఘటన్ ​కార్యదర్శి గుమ్మల్ల సత్యం, భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ పాల్గొని మాట్లాడారు. 

వీహెచ్​పీ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహమూర్తి అధ్యక్షత వహించారు. నాయకులు మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో విశ్వహిందూ పరిషత్ బలం పెరిగితే మత మార్పిడిలు ఆగిపోతాయన్నారు. వీహెచ్​పీ లీడర్లు బండారి రమేశ్, పండరినాథ్, సునీతారెడ్డి, రామ్ సింగ్, భాస్కర్ రావు, సహకార్యదర్శి తోట భానుప్రసాద్, వెంకటేశ్వరరాజు, రమేశ్, పగుడాకుల బాలస్వామి, కుమారస్వామి, శివరాములు, పద్మశ్రీ, వాణీసక్కుబాయి పాల్గొన్నారు.