
న్యూఢిల్లీ: ఇటీవల ముంబైలో 5జీ సేవలను ప్రారంభించిన వోడాఫోన్ ఐడియా సోమవారం 11 నగరాల్లోని ముఖ్యమైన క్రికెట్ స్టేడియాలకు ఈ సేవలను విస్తరించినట్లు తెలిపింది. అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, విశాఖపట్నంలోని స్టేడియాలలో క్రికెట్ అభిమానులు వోడాఫోన్ ఐడియా 5జీ నెట్సదుపాయాన్ని పొందవచ్చని వీఐఎల్ తెలిపింది.
వాంఖడే స్టేడియం (ముంబై), అరుణ్ జైట్లీ స్టేడియం (ఢిల్లీ), చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు), డాక్టర్ వై.ఎస్.ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం (విశాఖపట్నం), ఈడెన్ గార్డెన్స్ (కోల్‌కతా), ఎకానా స్టేడియం (లక్నో), ఎంఏ చిదంబరం స్టేడియం (చెన్నై), మహారాజా యాదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం ముల్లాన్‌పూర్ (చండీగఢ్), నమో స్టేడియం (అహ్మదాబాద్), రాజీవ్ గాంధీ స్టేడియం (హైదరాబాద్), సవాయి మాన్‌సింగ్ స్టేడియం (జైపూర్)లో 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉంటుంది. స్టేడియాల వంటి అధిక రద్దీ ప్రదేశాలలో హై స్పీడ్నెట్ను అందించడానికి అదనంగా 5జీ నెట్‌వర్క్ సైట్‌లను ఇన్స్టాల్చేశామని వీఐఎల్పేర్కొంది.-------------------