Viral Video: ఇటీవల కాలంలో ఆన్ లైన్ లో వస్తువులు ఆర్డర్ చేయడం చాలా కామన్ అయిపోయింది .. వ్యక్తిగత, ఆఫీసు పనుల్లో బిజీగా ఉండే వారంతా నిత్యావసరాలతో సహా ఏదీ కొనాలన్నా ఆన్ లైన్ ఫ్లాట్ ఫారమ్ ల ద్వారా వస్తువులను కొనుగోలు పరిపాటిగా మారింది. ఈ కస్టమర్లు అందుకున్న పార్సిల్ లో కొన్ని వింత రకమైన వస్తువులు, ఇటుకలు వంటివి రావడం మనం చూస్తు్న్నాం.. ఇదిగో ఈ అమెరికాకు చెందిన ఓ మహిళ కు ఇలాంటి పరిస్థితి ఎదురైందట. ఓ ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ ద్వారా డ్రెస్సులు బుక్ చేస్తే.. ఆమె అందుకున్న పార్సిల్ చూసి దడుసుకుని పెద్దగా అరిచింది... ఇంతకీ ఆమె అందుకున్న పార్సిల్ ఏమిటి.. అందులో ఏముంది.. ఆమె ఎందుకు భయపడిందో చూద్దాం రండి.
యూఎస్ కు చెందిన అన్నా ఇలియట్ అనే మహిళ ఆన్ లైన్ యాప్ ద్వారా కొన్ని డ్రెస్ లను ఆర్డర్ చేసింది. పార్సిల్ రానే వచ్చింది. సంతోషంగా తను బుక్ చేసుకున్న డ్రెస్సులను చూడాలని ఎంతో ఆత్రుతతో పార్సిల్ విప్పంది. పార్సిల్ లో ఉన్న దానిని చూసి షాక్ కు గురైంది. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంది.
ఇంతకీ పార్సిల్ ఏముంది.. పార్శిల్ తెరిచి చూసిన అన్నా ఇలియట్ కు రక్తపు శాంపిల్ ఉన్న బాటిల్, గులాబీ బీన్స్ డబ్బాను దర్శనమిచ్చాయి. దీంతో ఇలియట్ భయంతో పార్సిల్ విసిరి పడేసింది. తను ఆర్డర్ చేయని వస్తువులు రావడంతో మొదట భయపడిన ఇలియట్.. తేరుకుని తనకు ఎదురైన వింత అనుభవాన్ని అందరికి తెలియ జేయాలనుకుంది. సోషల్ మీడియాలో షేర్ చేసింది.
షీన్ అనే ప్లాట్ ఫారమ్ ద్వారా తీను డ్రెస్సులను కొనుగోలు చేశానని.. ఈ ఫ్లాట్ ఫారమ్ పై చాలా విమర్శలు ఉన్నాయి. ఈ ఫ్లాట్ ఫారమ్ ను ఉపయోగించినందుకు తనను నెటిజన్ల చాలా తిట్టుకున్నారని.. ఈ అనుభవం తర్వాత ఇకపై ఈ ప్లాట్ ఫారమ్ ను వినియోగించ బోనని సోషల్ మీడియాలో మరో వీడియోలో ఇలియట్ తెలిపింది.