
అబిడ్స్‌లోని స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో గురువారం హోలీ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. స్టూడెంట్లు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. డీజే పాటలు, డ్యాన్సులతో క్యాంపస్ ను హోరెత్తించారు. ఫొటోలు తీసుకుంటూ ఎంజాయ్చేశారు. ప్రిన్సిపాల్ డా.సత్యప్రసాద్ లంక, కరస్పాండెంట్ కె.కృష్ణారావు, డైరెక్టర్లు, మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొన్నారు.
అలాగే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వనిత మహిళా కాలేజీ స్టూడెంట్లు హోలీ జరుపుకున్నారు. రంగులు పూసుకుంటూ సందడి చేశారు. గురువారం రాత్రి సిటీ వ్యాప్తంగా కాముని దహనం నిర్వహించారు. కాలనీవాసులు అంతా ఒకచోట చేరి ప్రత్యేక పూజలు చేశారు. – వెలుగు, బషీర్‌బాగ్