ఇన్​చార్జి మున్సిపల్ చైర్మన్​గా ఉమారాణి 

నకిరేకల్, వెలుగు : నకిరేకల్ ఇన్​చార్జి మున్సిపల్ చైర్మన్ గా వైస్ చైర్మన్ శ్రీమతి మురారి శెట్టి ఉమారాణీకృష్ణమూర్తి నియమితులయ్యారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఉన్న మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ ( బీఆర్ఎస్ )పై16 మంది కౌన్సిలర్లు  అవిశ్వాసం కోరుతూ నల్గొండ కలెక్టర్ కు లేఖ అందజేయడంతో ఈనెల 12న అవిశ్వాస ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

శ్రీనివాస్ కు వ్యతిరేకంగా పెట్టిన తీర్మానం నెగ్గడంతో కొత్త చైర్మన్ ను ఎన్నుకునేవరకు మున్సిపల్ వైస్ చైర్మన్ ను ఇన్​చార్జి చైర్మన్ గా పదవి బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఉమారాణీకృష్ణమూర్తిని ఎమ్మెల్యే వేముల వీరేశం సన్మానించారు. కార్యక్రమంలో కమిషనర్ బాలయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.