
కంది, వెలుగు : అనాథ పిల్లలకు ఎల్లప్పుడు పీఎంకే ఫౌండేషన్ అండగా ఉంటుందని ఫౌండేషన్ వైస్ చైర్మన్ పట్నం రవితేజ తెలిపారు. మంగళవారం చిల్డ్రన్స్ డే సందర్భంగా సంగారెడ్డి టౌన్‌లోని ఓపెన్ షెల్టర్ ఫర్ బాయ్స్ అనాథశ్రమంలో కేక్ కట్ చేసి అక్కడి పిల్లలకు కొత్త బట్టలు అందజేశారు.
పిల్లలకు ఎలాంటి అవసరమున్న తమ ఫౌండేషన్‌ను సంప్రదిస్తే సహాయం అందిస్తామని తెలిపారు. అలాగే కొండాపూర్ మండలం తమ్మళిభాయ్ తండాలోని ప్రైమరీ స్కూల్లో ప్రధానోపాధ్యాయురాలు అలివేణి ఆధ్వర్యంలో చిల్ర్డన్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులను వివిధ స్వాతంత్ర్య సమరయోధుల వేశాలతో అలంకరించి నృత్యరూపకం చేయించారు.