హైదరాబాద్, వెలుగు : కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీని సాధించి తీరుతామని ప్లానింగ్‌బోర్డు వైస్‌చైర్మన్ బి. వినోద్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీని కేంద్రం తుంగలో తొక్కిందని..కాజీపేటకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కోచ్‌ఫ్యాక్టరీకి బదులుగా రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ వరంగల్‌కు రావడం ప్రజలను వంచించడమేనని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి కొత్త సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని.. ఆ ప్రభుత్వంతో కోచ్‌ఫ్యాక్టరీని సాధిస్తామని వినోద్ పేర్కొన్నారు.