పలు ఫైళ్లు మాయం చేసిన వీసీ.. కాకతీయ యూనివర్సిటీలో గందరగోళం

కాకతీయ యూనివర్సిటీలో గందరగోళం నెలకొంది. వీసీ తాటికొండ రమేష్ పలు ఫైళ్లు మాయం చేశారని అకుట్ కార్యదర్శి ఇస్తారి ఆరోపించారు. ఇవాళ్టితో (మే 21 2024)తో వీసీ పదవీకాలం ముగుస్తున్నందున పలు ఫైళ్లను తన ఇంటికి తీసుకెళ్లారని ఆరోపించారు. యూనివర్సటీ రిజిస్ట్రార్ మల్లారెడ్డితో ఇస్తారి వాగ్వాదానికి దిగారు. వీసీ చాంబర్ సీసీ ఫుటేజీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే పార్ట్ టైం అధ్యాపకులందరిని రెగ్యులర్ చేయాలని వీసీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు ఉపాధ్యాయులు. దీంతో వర్సీటీ పరిపాలన భవనం దగ్గర గందరగోళం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు వర్సీటీలోకి వెళ్లి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.