అప్పులు తీర్చలేక కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డ ఉపసర్పంచ్

ఉపసర్పంచ్​, అతని భార్య మృతి, పాప కండిషన్​ సీరియస్​

వైరా, వెలుగు:  ప్రేమించి పెళ్లి చేసుకున్నడు.. గౌరవంగా బతకాలని రాజకీయాల్లోకి వచ్చి ఉపసర్పంచ్​గా ఎన్నికయ్యాడు. ప్రైవేట్​ జాబ్​ చేస్తూ అప్పులు చేసి ఇళ్లు కట్టాడు. వాటిని  తీర్చలేక భార్య, పిల్లలకు పురుగుల మందు ఇచ్చి తానూ తాగాడు. ఈనెల 6న ఆత్మహత్య ప్రయత్నం చేయగా చికిత్స పొందుతూ సోమవారం భార్యభర్తలు చనిపోయారు.  కూతురు పరిస్థితి సీరియస్​గా ఉంది. బాబు కోలుకుంటున్నాడు. వైరా మండలంలోని బోడియాతండా గ్రామానికి చెందిన  బాబూరావు  బీటెక్ చదువు మధ్యలో ఆపేశాడు.అదే ఊరికి చెందిన  రంగమ్మను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.  వారికి బాబు, పాప ఉన్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో  ఉపసర్పంచ్ గా ఎన్నికైయాడు. ఇటీవల ఇల్లు కట్టుకునేందుకు అందిన చోటల్లా అప్పు చేశాడు. తిరిగి చెల్లించాలన్న ఒత్తిడి పెరగడంతో కూల్​డ్రింక్​లో పురుగుల మందు కలుపుకుని తాగారు.  బాబూరావ్​, మంగమ్మ సోమవారం చనిపోగా, మృతదేహలను పోస్టుమార్టం కోసం ఖమ్మం  ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

For More News..

చర్చలకు మేం రెడీ: రైతులు

ఉత్తరాఖండ్ జల ప్రళయానికి కారణమదేనా?

హైదరాబాద్‌లో ఎత్తైన అపార్ట్‌మెంట్.. పర్మిషన్ ఇచ్చిన అధికారులు