
ఉపస్త్రపతి జగదీప్ ధన్ఖడ్ అస్వస్థతకు గురయ్యారు.. ఆదివారం (మార్చి 9 ) తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఛాతి నొప్పి రావడంతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు ధన్ఖడ్. ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని.. ప్రస్తుతం ధన్ ఖడ్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు డాక్టర్లు.
ఎయిమ్స్ ఆసుపత్రి కార్డియాలజి విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ధన్ ఖడ్ కు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.