వెంకయ్య నాయుడుకు కరోనా పాజిటివ్

వెంకయ్య నాయుడుకు కరోనా పాజిటివ్

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా బారిన పడ్డారు. ఆయనకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం వెంకయ్య నాయుడు హైదరాబాద్ లో ఉన్నారు. ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. వారం రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంటానన్నారు. తనతో ఈ మధ్యకాలంలో కాంటాక్ట్ అయిన వాళ్లంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని వెంకయ్య నాయుడు కోరారు. 

గతంలో కూడా వెంకయ్య నాయుడుకు కరోనా సోకింది. ఇది రెండోసారి. అప్పట్లో కూడా రొటీన్‌గా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోగా.. ఆయనకు పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు కూడా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా వచ్చింది. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు వారు స్వీయ నిర్బంధంలో ఉండనుందని వెల్లడించింది కార్యాలయం.

మరోవైపు భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న టితో పోల్చితే 4 వేల 171 కేసులు తగ్గినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో కొత్తగా 3 లక్షల 33 వేల 533 కేసులు నమోదు కాగా..525 మంది  కరోనా కారణంగా మరణించారు. గడిచిన 24 గంటల్లో  2 లక్షల 59 వేల 168 మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో పాజిటివిటీ రేటు 17.78శాతం ఉండగా.. యాక్టివ్ కేసులు 21 లక్షల 87 వేల 205 ఉన్నాయి. అయితే కేసులు మెల్లగా తగ్గుతున్నా.. మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 

ఇవి కూడా చదవండి:

గోవా కాంగ్రెస్ అభ్యర్థుల ప్రతిజ్ఞ

32 ఏళ్ల తర్వాత అత్యధిక వర్షపాతం