వాషింగ్టన్: అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఓహియో సెనేటర్ జేడీ వాన్స్ ఎంపికయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతరం ట్రంప్ ఈ విషయాన్ని ప్రకటించారు. అప్పటినుంచి జేడీ వాన్స్ భార్య చిలుకూరి ఉష పేరు మార్మోగుతోంది. ఆమె ఆంధ్రా మూలాలున్న మహిళ కావడంతో యూఎస్ ఉపాధ్యక్షుడయ్యింది ఆంధ్రా అల్లుడేనంటూ ఏపీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వాన్స్‌తో లవ్ మ్యారేజీ
అమెరికాలోనే పుట్టి పెరిగిన జేడీ వాన్స్.. ఏపీ మూలాలున్న చిలుకూరు ఉషను పెండ్లి చేసుకున్నారు. ఆమె తల్లిదండ్రులది కృష్ణా జిల్లా పామర్రు వద్ద వడ్లూరు. వారు 1980లో ఇండియా నుంచి అమెరికాకు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. ఉష కాలిఫోర్నియాలోని శాండియాగోలో పుట్టిపెరిగారు. ముగ్గురి సంతానంలో ఈమె ఒకరు. తండ్రి క్రిష్ ఏరోస్పేస్ ఇంజినీర్. తల్లి లక్ష్మి శానిడియాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఉష యేల్ యూనివర్సిటీ నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఎంఫిల్ పూర్తి చేశారు. అనంతరం సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జిలు జాన్ రాబర్ట్స్, బ్రెట్ కవనాగ్ల వద్ద క్లర్క్‌గా పనిచేశారు. యేల్ లా స్కూల్లోనే ఉషాకు జేడీ వాన్స్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీళ్లిద్దరూ 2014లో హిందూ సంప్రదాయంలో పెండ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. పలు రంగాల్లో ప్రముఖ బిజినెస్‌మన్‌గా ఎదిగారు. 2022లో అమెరికా సెనేట్‌కు తొలిసారిఎన్నికయ్యారు.